చెర్రీ శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం అతడు కొంత కాలంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం షూటింగ్‌ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో గడిపారు.ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ మేరకు వారితో దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశాడు. ఇందులో వారితో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)