సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదకిగా బెట్టింగ్ యాప్స్ పై అలర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు. బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారు.
మీ స్వలాభంకోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం!? సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి.కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని యువత గుర్తించాలి. స్వార్ధ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. చాపకిందనీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండండి అంటూ ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు.
Sajjanar Shares Video on Betting Apps Fraud
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు.… pic.twitter.com/xfILzcR5Mm
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)