డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా ట్రైలర్ రిలీజైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా? అనే లైన్‌తో మూవీ తీసినట్లు స్వయంగా ప్రశాంత్ నీలే చెప్పాడు.

మెగా అభిమానులకు గుడ్ న్యూస్, మారేడుమిల్లి అడవుల్లో చిరు కొత్త మూవీ షూటింగ్, టైటిల్ ఏంటంటే..

సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు. ట్రైలర్ చివరలో ప్రభాస్‌ కనిపించాడు. యాక్షన్ తో అదరగొట్టేశాడు. ఆ ఫైట్ సీన్స్ అన్నీ వేరే లెవల్ హై ఇస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అలరిస్తోంది. ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే ఈసారి థియేటర్లలో దుమ్మరేగ్గొట్టేలా గ్యారంటీ. అలానే బాక్సాఫీస్‌కి బ్యాండ్ కూడా పక్కా అనిపిస్తోంది.

Here's Salaar Trailer

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)