అమితాబ‌చ్చ‌న్ న‌టించిన జుండ్ సినిమాను ఈనెల ఆర‌వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఆ రిలీజ్‌ను నిలిపివేయాల‌ని హైద‌రాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేక‌ర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హై కోర్టు ఇచ్చిన స్టేపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. స్ల‌మ్ సాక‌ర్ ఫౌండేష‌న్, ఫుట్‌బాల్ కోచ్ విజ‌య్ బ‌ర్సే జీవిత క‌థ ఆధారంగా జుండ్ చిత్రాన్ని తీశారు. ఓటీటీలో జుండ్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌వ‌ద్దు అని శుక్ర‌వారం తెలంగాణ కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న విష‌యం తెలిసిందే. చిత్ర నిర్మాత‌లు, నంది చిన్ని మ‌ధ్య జ‌రిగిన సెటిల్మెంట్‌లో వివాదం త‌లెత్తిన కార‌ణంగా జుండ్ సినిమా రిలీజ్‌పై సందిగ్ధం ఏర్ప‌డింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)