బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి తర్వాత కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు నటుడు శత్రుఘ్న సిన్హా.

సైఫ్ అలీఖాన్ పై జరిగిన ఈ దారుణమైన దాడి విచారకరం, దురదృష్టం అన్నారు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారని...దేవుడి దయ వల్ల త్వరగా కోలుకుంటున్నారన్నారు.

నా ఆల్ టైమ్ ఫేవరెట్ 'షో మ్యాన్' చిత్రనిర్మాత #రాజ్ కపూర్ మనవరాలు #కరీనా కపూర్ ఖాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నానని తెలిపారు. అయితే ఈ ఎపిసోడ్‌లో బ్లేమ్ గేమ్ ఆపాలని అనవసరంగా నిందలు వేయడం సరికాదన్నారు. పోలీసులు బాగా పనిచేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నానని చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎంలు శరద్ పవారస్, ఏక్‌నాథ్‌ షిండే చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు చెప్పారు శత్రృఘ్న సిన్హా. సైఫ్‌ అలీఖాన్‌ పై దాడి కేసు.. ముంబై పోలీసుల అదుపులో అసలైన నిందితుడు.. పూర్తి వివరాలు ఇవిగో..! 

Shatrughan Sinha Prays For Actor Saif Ali Khan speedy recovery

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)