ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్‌ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె చిన్నారి ఫొటోను మాత్రం షేర్‌ చేయలేదు. తాజాగా తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన తనయుడికి దేవ్యాన్‌ ముఖోపాధ్యాయగా నామకరణం చేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇందులో దేవ్యాన్‌ ముఖం మాత్రం కనిపించకుండా వారు జాగ్రత్త పడ్డారు.

గత నెల మే 22న శ్రేయా ఘోషల్‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రేయా చిన్నారి దేవ్యాన్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇంట్రడ్యూసింగ్‌ దేవ్యాన్‌ ముఖోపాధ్యాయ. అతను మే 22న మా జీవితంలోకి వచ్చాడు. అతడి రాకతో మా హృదయాలు ఒక రకమైన ప్రేమను నింపాడు. ఒక తల్లి, ఒక తండ్రి మాత్రమే ఇలాంటి మధురమైన అనుభూతిని పొందగలరు. స్వచ్చమైన, హద్దులు లేని ప్రేమకు ఈ చిన్నారి దేవ్యాన్‌ నిదర్శనం’ అంటు ఆమె మురిసిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)