RGV Spark OTT Stream: ఓటీటీ వ్యాపారంలోకి వర్మ, స్పార్క్‌ పేరుతో ఓటీటీ యాప్ త్వరలో రిలీజ్, మే 15వ తేదీన మొదటి సినిమాగా స్ట్రీమింగ్ కానున్న డీ-కంపెనీ

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఓటీటీ బాట పట్టాడు. ఆయన సొంతంగా స్పార్క్‌ అనే పేరుతో ఓటీటీ యాప్‌ను నటి, నిర్మాత చార్మీతో కలిసి స్థాపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఆయన దర్శకత్వంలో వహించిన ‘డీ-కంపెనీ’ మే 15వ తేదీన మొదటి సినిమాగా ఇందులో స్ట్రీమింగ్‌ కానుంది.

RGV Spark OTT Stream: ఓటీటీ వ్యాపారంలోకి వర్మ, స్పార్క్‌ పేరుతో ఓటీటీ యాప్ త్వరలో రిలీజ్, మే 15వ తేదీన మొదటి సినిమాగా స్ట్రీమింగ్ కానున్న డీ-కంపెనీ
RGV says, It's pointless to ask brutal punishment for Hyderabad Vet's rapists and murderers (Photo-Twitter)

కాగా ఆర్జీవీ ప్రముఖ టీవీ హోస్ట్‌ స్వప్న, వ్యాపారవేత్త సాగర్‌ మచనూరు సహకారంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్పార్క్‌ యాప్‌ను ప్రారంభించాడు.ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌, ప్రకాశ్‌ రాజ్‌, దగ్గుబాటి సురేశ్‌ బాబు, పూరి జగన్నాథ్‌, మంచు లక్ష్మీ, అడవి శేషు, బాలీవుడ్‌ హీరో రిషితేష్‌ దేశ్‌ముఖ్‌తో సహా పలువురు హీరో హీరోయిన్లు, నటీనటులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఇప్పటికే తెలుగులో ఆహా పేరుతో నిర్మాత అల్లు అరవింద్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంను స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ సైతం కొత్తగా ఓటీటీ సంస్థలను స్థాపించాలని సన్నాహాలు చేస్తునట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Here's Ram Gopal Varma Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 10, 2021 03:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).