ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును తమిళ సినీ నటుడు విజయ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చిన విజయ్‌కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సాదరంగా ఆహ్వానించారు. విజయ్‌కి సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు. సీఎం కేసీఆర్‌.. విజయ్‌ని ఆప్యాయంగా పలుకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. సీఎంను కలిసిన వారిలో ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)