నాగార్జున హీరోగా డైరెక్టర్‌ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు నాగార్జున ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఫాంటసీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఘోస్ట్‌' (The Ghost First Look) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వర్షంలో కత్తి పట్టుకొని ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్ ప్యాక్‌ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)