Newdelhi, Feb 10: సీబీఎస్‌ఈ బోర్డు (CBSE Board) పరీక్షలు రాసే డయాబెటిక్ విద్యార్థులకు (Diabetic Students) బోర్డు ఊరట కలిగించింది. డయాబెటిక్ సమస్య ఉన్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్, గ్లూకోమీటర్ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం డయాబెటిక్ విద్యార్థులు తొలుత పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా పాఠశాల ద్వారా దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను సమర్పించాలి. తర్వాత పరీక్షలు ప్రారంభానికి ఒకరోజు ముందు పరీక్ష కేంద్రానికి వెళ్లి డయాబెటిక్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. దీంతో అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు.
📚 **CBSE Board Exam 2024: Candidates with diabetes can carry fruits, water bottle, glucometer to test centre!**
— Live Updates🚨 (@itsliveupdate) February 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)