Hyderabad, Dec 1: జేఈఈ మెయిన్‌ -1 (JEE Main 2024) దరఖాస్తుల గడువును డిసెంబర్‌ 4 వరకు పొడిగించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ-NTA) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది. డిసెంబర్‌ 6 నుంచి 8 వరకు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ -1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ కు 8.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. తాజా గడువు పెంపుతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరగనున్నది.

LPG Cylinder Price Hike: గ్యాస్‌ మంట.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.21 పెంపు.. హైదరాబాద్‌లో రూ.2024.5కు చేరిన గ్యాస్ బండ ధర

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)