Hyderabad, Nov 24: నిన్నటి నుంచి తెలంగాణలో (Telangana) వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నట్టు పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌లో అత్యల్పంగా 17 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)