మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాక్సినేషన్‌ కేంద్రంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా (30 Students Vaccinated) ఇవ్వడం కలకలం సృష్టించింది. అయితే, దీనికి ఆయన చెప్పిన సమాధానం విన్న స్థానికులు అవాక్కయ్యారు. తన పై అధికారులు ఆదేశాల మేరకే తాను ఇలా చేసినట్టు (Single Injection-Syringe) స్పష్టం చేశారు. వివరాల ప్రకారం..సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. అది గమనించిన విద్యార్థులు పేరెంట్స్‌ ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ పై అధికారులు ఒకే సిరంజీ పంపించారని, ఆ ఒక్క సిరంజీతోనే విద్యార్థులందరికీ టీకా వేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఈ క్రమంలో ఇలా టీకా వేయడంలో తప్పు ఏముంది అంటూ వ్యాఖ్యలు చేయడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో, పిల్లల పేరెంట్స్‌ అతడిపై దాడి చేసినంత పనిచేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)