ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని నారాయణపూర్ ఐజీ సంజయ్ రాజ్ చెప్పారు.ఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం అంబూజ్‌మడ్‌లోని కోహ్‌కామెటా పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా అవతలివైపు నుంచి కాల్పులు మొదలవడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
Here's News
Five Naxalites killed in encounter with security forces in Chhattisgarh's Narayanpur
Read @ANI Story | https://t.co/qusr4kwuAJ#ChhattisgarhNews #naxalattack #Narayanpur pic.twitter.com/ijs8aWc9Yg
— ANI Digital (@ani_digital) July 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)