మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రాపూర్‌-ముల్‌ రోడ్డుపై అజయ్‌పూర్‌ సమీపంలో డీజిల్‌ ట్యాంకర్‌, మొద్దుల లోడుతో వెళ్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో లారీ డ్రైవర్‌తోపాటు కూలీలు ఉన్నారని చంద్రాపూర్‌ ఎస్డీపీవో సుధీర్‌ నందన్‌వార్‌ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)