కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సాగుతున్న బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీని ఆరేళ్ల బుడ్డోడు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు.దీనికి రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు.ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని అన్నారు.

తరువాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్ష్ అనే ఆరేళ్ల బాలుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఓ బ్లాగ్ క్రియేట్ చేశాడు. దానిలో ఆ కుర్రాడు రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా అభివర్ణించాడు. కాగా బీహార్ వచ్చిన రాహుల్‌ను చూసేందుకు జనం తరలివచ్చారు. ఈ యాత్ర మణిపూర్‌లో ప్రారంభమై పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్‌కు చేరుకుంది.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)