ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం స్వీడన్‌ స్టాక్‌హోమ్‌లో అ‍త్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపంతో ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల విమానాన్ని స్వీడన్‌కు దారిమళ్లించాల్సి వచ్చింది. ఫ్లైట్‌లో మొత్తం 300 మంది ప్రయాణికులున్నారు.అయితే విమానంలో అందరూ సురక్షితంగానే ఉన్నారని, స్టాక్‌హోం విమానాశ్రయానికి ఫైర్ ఇంజిన్లకు కూడా తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఆయిల్ లీక్‌ కారణంగా విమానం రెండో ఇంజిన్ ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పారు. సమస్యను గుర్తించామని, ఇన్‌స్పెక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం లండన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీన్ని దారిమళ్లించారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)