ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నూతన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన భారత వైమానికి దళానికి సంబంధించిన ఆధునికీకరణ బాధ్యతలు చూడనున్నారు. అదేవిధంగా భారత వైమానిక దళంలో కొత్త జరిగే కొనుగోళ్లను కూడా పర్యవేక్షించనున్నారు. భారత రక్షణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత వైమానిక దళం ప్రస్తుతం దేశీయ పరిశ్రమల నుంచి కొత్త యుద్ధ విమానాలైన LCA మార్క్‌ 1 A, LCA మార్క్ 2, అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలును, అదేవిధంగా ప్రధాన కొనుగోళ్లను ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ పర్యవేక్షించనున్నారు. కాగా, అశుతోష్‌ దీక్షిత్‌ 1986 డిసెంబర్‌ 6న భారత వైమానిక దళంలో చేరారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)