అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని అప్ప‌ర్ సియాంగ్ జిల్లాలో గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. యింగ్‌కియాంగ్‌లోని మార్కెట్ ఏరియాలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో 30కి పైగా ఇండ్లు, దుకాణాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని సుమారు 4 గంట‌ల పాటు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చాయి. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో మంట‌లు అదుపులోకి వ‌చ్చిన‌ట్లు అప్ప‌ర్ సియాంగ్ డిప్యూటీ ఎస్పీ ఓపిర్ పారాన్ తెలిపారు. ఈ ప్ర‌మాదంతో సుమారు రూ. 5 కోట్ల ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్లు పేర్కొన్నారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)