ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ జడ్‌ కేటగిరి భద్రతను అంగీకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమితాషా కోరారు. ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ కాన్యాయ్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. ఘటన పూర్వపరాలు, విచారణ వివరాలు సభకు వెల్లడించారు. అయితే ప్రత్యేక భద్రతను ఒవైసీ తిరస్కరించారు. చావుకు తాను భయపడిపోనని, తనకు జడ్‌ కేటగిరి అవసరం లేదని, అందరిలాగే తాను ఏ కేటగిరి పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. CAA నిరసన సమయంలో మరణించిన 22 మంది కంటే నా ప్రాణం విలువ కాదని నేను హోం మంత్రికి చెప్పాలనుకుంటున్నాను. నా చుట్టూ ఆయుధాలు ఉన్నవారిని నేను ఇష్టపడను, నేను స్వేచ్ఛా పక్షిని, స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని ఒవైసీ తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)