కర్ణాటకలోని శివమొగ్గలో చెలరేగిన హిజాబ్ వివాదంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం (Asaduddin Owaisi Warns PAK) వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లోనే అనేక సమస్యలు ఉన్నాయని, ముందు వాటి సంగతి చూసుకోండని, ఇండియా తమ దేశమని ఇక్కడ వేలు పెట్టాలని చూస్తే ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని ఆయన (Owaisi warns Pakistan)హెచ్చరించారు.పాకిస్థాన్‌లో మలాలాపై కాల్పులు జరిపినప్పుడు ఆమె విదేశాల్లో చదువు పూర్తి చేయాల్సి వచ్చిందని ఒవైసీ గుర్తు చేశారు. పాకిస్థాన్ తన పనిపై దృష్టి పెట్టాలని, ఆడపిల్లలకు భద్రత లేని దేశం మాకు ఉఫన్యాసాలు ఇవ్వడమేందని మండి పడ్డారు.

కాలేజీలో బురఖా ధరించినందుకు కర్ణాటకలో మంగళవారం ఆకతాయిల వేధింపులకు గురైన బాలిక ముస్కాన్‌తో తాను మాట్లాడానని ఒవైసీ ట్వీట్ చేశారు. నేను అమ్మాయితో, ఆమె కుటుంబంతో మాట్లాడాను అని ఒవైసీ చెప్పారు. "ఆమె విద్య పట్ల తన నిబద్ధతలో స్థిరంగా నిలబడాలని, ఆమె మతం మరియు ఎంపిక స్వేచ్ఛను ఉపయోగించాలని ప్రార్థించారు. ఆమె నిర్భయ చర్య మనందరికీ ధైర్యాన్ని కలిగించిందని నేను అమ్మాయికి చెప్పాను" అని ఒవైసీ అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)