ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసింది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్‌గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ.
ANI tweet
Balasore train accident | CBI has arrested 3 people, senior Section engineer Arun Kumar Mohanta, section engineer Mohammad Amir Khan & technician Pappu Kumar, under sections 304 and 201 CrPC pic.twitter.com/EkXTYFHncd
— ANI (@ANI) July 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)