భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ లండన్ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారని.. ఆర్థిక సాయం కోసం చూస్తున్నారని భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు.ఈ మేరకు ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ నుంచి తనకు ఆర్థిక సాయం అందినట్లు గైక్వాడ్ చెప్పారని, కానీ మరింత డబ్బు అవసరం ఉన్నట్లు తనతో చెప్పాడని సందీప్ పాటిల్ వెల్లడించారు.
విషయం తెలియగానే దిలీప్ వెంగ్‌సర్కార్‌తో కలిసి తాను బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్‌తో మాట్లాడినట్లు చెప్పారు. అన్షుమన్‌ను ఆసుపత్రిలో చూసిన తర్వాత తాము షెలార్‌కు ఫోన్ చేశామన్నారు. తమ అభ్యర్థనకు ఆయన సానుకూలంగా స్పందించారని, అలాగే ఇతర మాజీ క్రికెటర్లు కూడా నిధుల కోసం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. బోర్డ్ నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. అన్షుమన్ ప్రాణాలు కాపాడుతాడని భావిస్తున్నట్లు చెప్పారు. అన్షుమన్ గైక్వాడ్ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత టీమిండియాకు రెండుసార్లు ప్రధాన కోచ్‌గా పని చేశాడు.
Here's News
Sandeep Patil urges the BCCI to cover Anshuman Gaekwad's medical expenseshttps://t.co/Cdsf2JEIeR
— CricTracker (@Cricketracker) July 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)