బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది. దీంతో కాన్వాయ్‌లోని కార్ల నాలుగు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్‌ కుమార్‌ (CM Nitish Kumar) లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా సీఎం నితీశ్‌ కుమార్‌ నేడు గయాలో పర్యటించాల్సి ఉంది. ఆయన గయా పట్టణానికి హెలీకాప్టర్‌లో చేరుకోనున్నారు.

ఈనేపథ్యంలో సీఎం స్థానికకంగా తిరగడంకోసం ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్లు ఆదివారం సాయంత్రం గయకు బయలుదేరాయి. అయితే పట్నా-గయా హైవేపై రాజధాని శివార్లలో అప్పటికే కొందరు తమ సమస్యను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నారు. ఈక్రమంలో సీఎం కాన్వాయ్‌ అటుగా రావడంతో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు 13 మంది నిందితులను అరెస్టు చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)