దేశంలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం సృష్టించింది. బీహార్‌ సుపాల్ జిల్లాలో వరుసగా పక్షులు చనిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. చప్కాహి గ్రామంలో మార్చి 31న అనుమానాస్పదంగా బాతులు, కోళ్లు, ఇతర పక్షులు చనిపోవడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. దీంతో, చనిపోయిన పక్షుల సాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు టెస్టుల కోసం పంపించారు. ఈ టెస్టుల్లో పక్షులకు ఏమియన్ బర్డ్ ప్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (హెచ్5ఎన్1) బర్డ్‌ ఫ్లూ సోకినట్టుగా తేలింది. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వ్యాధి సోకిన ప్రాంతం నుంచి కిలోమీటర్ వ్యవధి వరకు ఫౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లను చంపేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో చికెన్ తినకుండా చూడాలని జిల్లా అధికారులు ప్రజలను ఆదేశించారు. కోళ్ల ఫారాల్లో కోళ్లను చంపి, పాతిపెట్టేందుకు స్పెషలిస్ట్ పశుసంవర్ధక అధికారులు, వెటర్నరీ వైద్యులతో 4 ర్యాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశారు. దీంతో కోళ్లు పెద్ద గోతిలో వేసి చంపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)