బీహార్ (Bihar)లో నెల రోజుల వ్యవధిలో మరో వంతెన కూలిపోయింది (bridge collapses). గంగానది (river Ganga)పై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన Pipa Pul కూలిపోయింది. ఈనెల 4వ తేదీన ఖగడియా జిల్లా భగల్ పూర్ లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిషన్ గంజ్ జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది.
తాజాగా గంగానదిపై నిర్మించిన Pipa Pul వంతెన బలమైన గాలుల కారణంగా కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో వంతెన దాటుతున్న కొందరు చిక్కుకుపోయినట్లు చెప్పారు. జూన్ 20 నాటికి వంతెనను కూల్చివేయాల్సి ఉండగా.. ఇంతలోనే వంతెన కూలిపోయినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే మూడో ఘటన కావడం గమనార్హం.
ANI Video
#WATCH | Portion of a temporary bridge built on river Ganga in Bihar's Vaishali washed away due to strong winds. The bridge connected Raghopur to the Vaishali District Headquarters. pic.twitter.com/tX3XzWjieg
— ANI (@ANI) June 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)