బీహార్‌ (Bihar)లో ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదిన దారుణ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకోగా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ కిడ్నాప్‌ కేసులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలు వీధిలో కొట్టుకున్నారు.

ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి .. దళిత మహిళను కర్రతో దారుణంగా కొట్టాడు (thrashed). సదరు పోలీసును సురాసంద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ రాజ్‌కిషోర్‌ సింగ్‌గా గుర్తించారు. స్థానికులు చూస్తుండగానే యూనిఫాంలో ఉన్న రాజ్‌ కిషోర్‌ మహిళను చితకబాదాడు. ఈ ఘటనపై సీతామర్హి ఎస్పీ మనోజ్‌ కుమార్‌ తివారీ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం సదరు పోలీసు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మనోజ్‌ వెల్లడించారు.

Heres' Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)