బిహార్‌లోని మూడు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, అరారియాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. కఠిన వాతావరణ పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు.
राज्य के 3 जिलों में वज्रपात से 11 लोगों की मृत्यु दुःखद। मृतकों के आश्रितों को तत्काल 4-4 लाख रू० अनुग्रह अनुदान दिया जाएगा। खराब मौसम में पूरी सतर्कता बरतें। वज्रपात से बचाव हेतु आपदा प्रबंधन विभाग द्वारा जारी सुझावों का अनुपालन करें। खराब मौसम में घरों में रहें, सुरक्षित रहें।
— Nitish Kumar (@NitishKumar) September 19, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)