బిహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. 15 మందితో ఒక ఆటో లఖిసరాయ్‌ నుంచి సికంద్రా వైపు వెళుతుండగా ఓ ట్రక్కు దానిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది.ముంగేర్ జిల్లాలోని జమాల్‌పూర్ నివాసితులైన ఆటోలోని ప్రయాణికులు సికంద్రాలో క్యాటరింగ్ పని ముగించుకుని లఖిసరాయ్ రైల్వే స్టేషన్‌కు ఆటోలో వెళుతున్నారు. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన వాహనంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర విషాదం, 24 గంటల్లో పిడుగుపాటుకు 15 మంది మృతి, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్ గ్రేషియా

Here's PTI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)