ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్‌ సింగ్‌ బగ్గాను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, బగ్గా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వ్యాఖ‍్యలు చేసిన కారణంగా అతడిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. మొహాలీలోని సైబ‌ర్ సెల్‌లో న‌మోదు అయిన ఫిర్యాదు ఆధారంగా అత‌న్ని ఢిల్లీలో ప‌ట్టుకున్నారు. బీజేవైఎం జాతీయ కార్య‌ద‌ర్శి అయిన త‌జింద‌ర్‌పై ఆప్ నేత స‌న్నీ సింగ్ ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం.. మార్చి 30వతేదీన జరిగిన నిరసన ప్రదర్శనలో ఆప్‌ చీఫ్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఆప్‌ నేతలు పోలీసులకు అందజేశారు. దీంతో అతడిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేసిట్టు తెలిపారు. ఈ మేరకు బగ్గాను అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి కపిల్‌ మిశ్రా స్పందిస్తూ.. తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే కేజ్రీవాల్‌ ఇలా అరెస్టులు చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. 50 మంది పంజాబీ పోలీసులు వ‌చ్చి త‌జింద‌ర్‌ను ఇంటి నుంచి తీసుకువెళ్లిన‌ట్లు బీజేపీ నేత క‌పిల్ మిశ్రా ఆరోపించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)