ఎక్స్ వేదికగా కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో చెప్పి..ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంది కాంగ్రెస్ సర్కారు అని మండిపడ్డారు. తెల్ల బంగారం తెల్లబోతుంది...బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదు అన్నారు.
పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడు...సీసీఐ కొర్రీలు పెట్టి..సాకులు చూపెట్టి కొనుగోళ్లు నిలిపేసిందన్నారు. రైతన్న ఆగమైతుంటే..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదు అని...రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి.. కీలకమైన కాటన్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ లేదు..శ్రద్ధలేదు..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధిలేదు అన్నారు. ఇప్పటికే..దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేసారు..సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారు..పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారు అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి జైలు శిక్ష, శ్రీకాంత్ గౌడ్ కు 14 రోజులు జైలు శిక్ష...మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలింపు
Here's Tweet:
తెల్ల బంగారం తెల్లబోతున్నది
బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదు
పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడు
సీసీఐ కొర్రీలు పెట్టి..సాకులు చూపెట్టి కొనుగోళ్లు నిలిపేసింది
రైతన్న ఆగమైతుంటే..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదు
క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు… pic.twitter.com/pPCYjMoTZE
— KTR (@KTRBRS) October 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)