బుల్లీ భాయ్ యాప్ కేసులో నీరజ్ బిష్ణోయ్, సుల్లీ డీల్సీ యాప్ సృష్టికర్త ఓంకారేశ్వర్ ఠాకూర్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. మానవతా కోణంలో ఆ బెయిల్‌ను మంజూరీ చేశాం. నేరస్తులు ఇద్దరూ తొలిసారి నేరాలకు పాల్పడ్డారని, వారిని నిత్యం జైలులో నిర్బంధించడం సరికాదన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. అయితే కఠిన ఆంక్షల నడుమ ఆ ఇద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. సాక్ష్యులను బెదిరించడం కానీ, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం కానీ చేయకూడదని కోర్టు చెప్పింది. బెయిల్ మీద ఉన్నన్ని రోజులు నిందితులు మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడరాదు అని, పిలిచిన ప్రతిసారీ కోర్టుకు హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. మెజిస్ట్రేట్ డాక్టర్ పంకజ్ శర్మ ఈ కేసులో ఆదేశాలు ఇచ్చారు. 50 వేల బాండ్ పూచీకత్తుపై బెయిల్‌కు అంగీకరించారు.
'Bulli Bai' App Case Accused Niraj Bishnoi, 'Sulli Deals' Creator Aumkareshwar Thakur Granted Bail on Humanitarian Grounds#BulliBai #SulliDeals #DelhiHC #NationalNewshttps://t.co/Dco9zYk8SY
— LatestLY (@latestly) March 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)