కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సరిపడా నీటిని విడుదల చేయకపోవడాన్ని ఖండిస్తూ తమిళనాడులోని తిరుచ్చిలో దేశీయ తెన్నింటియ నాతిగల్ ఇనైప్పు వివాహాయిగల్ సంఘం సభ్యులు..ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యకన్ను ఆధ్వర్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అంత్యక్రియలు నిర్వహించి నిరసన తెలిపారు. కావేరి నుండి నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా కావేరి నీటి వివాదం రెండు రాష్ట్రాల్లో అగ్గి రాజేస్తోంది.

తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని (Cauvery water Dispute) వివిధ కన్నడ సంఘాలు తప్పుపడుతున్నాయి. తమిళనాడుకు 15 రోజులపాటు రోజూ 5 వేల క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేయాలని కావేరి వాటర్‌ మేనేజ్‌మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ) ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాదాపు 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్‌కు (Bengaluru bandh today) పిలుపునిచ్చాయి.

Tamil Nadu People by performing last rites of Karnataka CM Siddaramaiah condemning the state government for not releasing enough water from Cauvery (Photo-Video Grab/PTI)

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)