నెల రోజులు కూడా గడవకముందే మరోసారి కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు కంపెనీలు పెంచేశాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.100 వంతున చమురు కంపెనీలు ధర పెంచాయి. బుధవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తున్నట్టు ఏఎన్‌ఐలో కథనం ప్రచురితమైంది. దీనిపై చమురు కంపెనీలు ఇంకా నోరు విప్పలేదు. ఇంతకు ముందు నవంబరు 1న 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.266 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర సగటున రూ.2000లకు అటుఇటుగా నమోదు అవుతోంది. సరిగ్గా నెల రోజుల వ్యవధి ఇచ్చి ఈసారి సిలిండర్‌ ధరను వంద రూపాయలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా సగటున సిలిండర్‌ ధర రూ.2100కి చేరుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)