ముంబై, కోల్‌కతా మరియు చెన్నై నగరాలతో సహా దేశవ్యాప్తంగా 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.30.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అంటే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.చమురు సంస్థల నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,795గా ఉన్న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1,764.50కి తగ్గింది. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత నెల మహిళా దినోత్సవం సందర్భంగా గృహావసరాల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)