దేశంలోని ప్రతి ఒక్కరికీ డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ ఇస్తామనే గడువుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. రాష్ట్రాలే వ్యాక్సిన్ సేకరించుకోవాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని శశిథరూర్ పేర్కొన్నారు. భారతీయులందరికీ యూనివర్శల్ వ్యాక్సినేషన్ అందజేసేలా ప్రభుత్వ విధానంలో భారీ మార్పులు చేయాలంటూ భారత జాతీయ కాంగ్రెస్ చేపట్టిన విస్తృత ప్రచారానికి తాను మద్దతిస్తున్నానని, డిసెంబర్‌లోగా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని శశిథరూర్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశాన్ని కోవిడ్ నుంచి కాపాడేందుకు సార్వత్రిక, ఉచిత టీకాల పంపిణీ చేపడదాం.. నేను బాధలో, నాకన్నా మించి ఇతరులు పడ్డ బాధల్లో అణువంతైనా కూడా ఇతరులు అనుభవించాలని అనుకోవడం లేదు” అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)