దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, 3549 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 79.82 కేసులు ఉన్నాయని, ఇందులో ఢిల్లీలో 1365 కేసులు (38.5 శాతం) నమోదవగా, హర్యానాలో 534, ఉత్తరప్రదేశ్‌లో 356, కేరళ 342, మహారాష్ట్రలో 233 కేసులు రికార్డయ్యాయని వెల్లడించింది.ఇక ఇప్పటివరకు 1,89,81,52,695 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో 16,59,843 మందికి గురువారం వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది. అదేవిధంగా నిన్న ఒక్కరోజే 4,23,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.
3,545 new COVID19 cases in India today; Active caseload at 19,688 pic.twitter.com/3sz7h1RuG7
— ANI (@ANI) May 6, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
