కొవిడ్ నిబంధన విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ఆంక్షల్ని (Covid-19 Restrictions) పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి ఏం కాదని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1, శుక్రవారం నుంచి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాస్క్ ధరించకపోతే.. పెనాల్డీ విధించబోమని పేర్కొంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 2005 యాక్ట్ ప్రకారం ఇంతకాలం అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తేసినట్లు పేర్కొంది. అయితే కరోనా ముప్పు (Coronavirus in Maharashtra) ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు కాబట్టి ప్రజలంతా స్వచ్చందంగా మాస్క్‌లు ధరించాలని మాత్రం మహా సర్కార్ సూచించింది. బీఎంసీ కూడా మాస్క్ తప్పనిసరి కాదని, ఫైన్ విధించబోమని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Maharashtra Government issues order withdrawing all COVID19 restrictions. pic.twitter.com/wTaKCPUa7G
— ANI (@ANI) April 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)