దేశంలో గత 24 గంటల్లో 1,79,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,629 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం దేశంలో 61,013 కేసులు యాక్టివ్ (Active Cases) గా ఉన్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో 11,967 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,23,045కి చేరింది. కేరళలో 10 మంది, ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున, ఒడిశా, గుజరాత్, చత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,398 కి ఎగబాకింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.14 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,50,086) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది
Here's ANI Tweet
COVID-19 | India records 9,629 new cases in the last 24 hours; Active cases stand at 61,013
— ANI (@ANI) April 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)