గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,109 మంది వైరస్ బారినపడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజు కంటే 9 శాతం అధికంగా కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో 1,527, మహారాష్ట్రలో 1,086 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ పెరుగుదలతో క్రియాశీల కేసుల సంఖ్య 49,622(0.11శాతం)కి చేరింది. రికవరీ రేటు 98.70శాతంగా నమోదైంది. కొత్తగా కేంద్రం 20 మరణాలను ప్రకటించింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)