బీహార్‌లో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని మున్సిపాలిటీ చెత్త రిక్షాలో శ్మశానవాటికకు తరలించారు. రాష్ట్రంలోని నలందా జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 13న కరోనాతో మరణించాడు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నలంద మున్సిపల్ సిబ్బంది నిన్న ఆ మృతదేహాన్ని చెత్త రిక్షాలో స్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది అతన్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, దీనిపై నలంద సివిల్ సర్జన్ స్పందించారు. అత్యక్రియలు నిర్వహించడానికి 2 వందలకుపైగా వాహనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
A #COVID19 patient's body was carried to the crematorium on a cart of Municipal Corporation in Bihar's Nalanda yesterday. pic.twitter.com/y3iA2yjlPp
— ANI (@ANI) May 17, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)