దేశవ్యాప్తంగా జేఎన్ 1(JN.1 Cases ) వేరియంట్ మెల్లిగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. నేటి వరకు ఆ వైరస్ వేరియంట్ సోకిన వారి సంఖ్య 69కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. డిసెంబర్ 25వ తేదీ వరకు ఆ సంఖ్య ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కర్నాటకలో తాజాగా ముగ్గురు కరోనాతో మృతి చెందారు. ఆదివారం వరకు జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసుల సంఖ్య 63గా ఉన్న విషయం తెలిసిందే. కేవలం గోవాలోనే ఒకే రోజు 34 జేఎన్ 1 వేరియంట్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 9, కర్నాటకలో 8, కేరళలో ఆరుగురు, తమిళనాడులో నలుగురు, తెలంగాణలో ఇద్దరికి జేఎన్ 1 వేరియంట్ పాజిటివ్‌గా నమోదు అయ్యింది. జెఎన్ 1 సోకిన వారిలో స్వల్ప స్థాయిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 116 కేసులు నమోదు, తాజాగా ముగ్గురు మృతి, కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు
Here's ANI News
A total of 69 JN.1 COVID variant cases have been reported in the country till 25th December. 34 cases from Karnataka, 9 from Maharashtra, 14 from Goa, 6 from Kerala, 4 from Tamil Nadu and 2 from Telangana: Sources
— ANI (@ANI) December 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)