దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 12, 781 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 76,700కు చేరుకుంది. యాక్టివ్ కేసుల శాతం 0.18గా ఉంది. అదే సమయంలో వైరస్ వల్ల నిన్న 18 మంది మృతి చెందారు. దాంతో, మొత్తం మృతుల సంఖ్య 5,24,873కు చేరుకుంది. కోవిడ్ మరణాల శాతం 1.21 గా నమోదైంది. ఇక గడచిన 24 గంటల్లో 8,537 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటిదాకా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 27లక్షల 7,900కి చేరుకుంది. రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది. కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రోజువారీ కోలుకున్న వారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఇక, నిన్న 2,80,136 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దాంతో, దేశంలో ఇప్పటిదాకా అందించిన కరోనా డోసుల సంఖ్య 196 కోట్ల 18 లక్షల 66, 707గా నమోదైంది.
#COVID19 | India reports 12,781 new cases, 8,537 recoveries and 18 deaths in the last 24 hours.
Active cases 76,700
Daily positivity rate 4.32% pic.twitter.com/f17et5xFcu
— ANI (@ANI) June 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)