దేశంలో వరుసగా రెండో రోజు 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 5.19 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... వారిలో 12,847 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 4,255 కేసులు వచ్చాయి. కేరళలో 3,419 కేసులు, ఢిల్లీలో 1,323 కేసులు, కర్ణాటకలో 833 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి 7,985 మంది కోలుకోగా... 14 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,063కి పెరిగింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5,24,817 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 1,95,84,03,471 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 15.27 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
#COVID19 | India reports 12,847 new cases, 14 deaths & 7,985 recoveries, in the last 24 hours.
Active cases 63,063
Daily positivity rate 2.47% pic.twitter.com/C6pPVVarcW
— ANI (@ANI) June 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)