దేశంలో కరోనా కేసులు 558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Health Ministry) మంగళవారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కొవిడ్ కేసులు (Coronavirus in India) రికార్డయ్యాయని పేర్కొన్నది. కొత్తగా 10,004 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,48,383కు పెరిగింది. ఇందులో 3,40,79,612 మంది కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 4,73,757 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 95,014 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 128.76కోట్ల మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది
#COVID19 | India reports 6,822 new cases (lowest in 558 days), 10,004 recoveries and 220 deaths in the last 24 hours. Active caseload currently stands at 95,014 - lowest in 554 days: Ministry of Health and Family Welfare
128.76 crore vaccine doses have been administered so far. pic.twitter.com/ryauaLnq2u
— ANI (@ANI) December 7, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)