ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన Dahra Global Case కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారుల (Former Indian Navy personnel)కు ఖతర్‌ (Qatar)లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్‌ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మరణశిక్ష (Death Sentence)ను రద్దు చేస్తూ వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఖతర్‌ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ (MEA) ఓ ప్రకటనలో వెల్లడించింది.

అయితే, వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఖతర్‌ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)