వచ్చే నెల మధ్య నాటికి కోవిడ్ కంట్రోల్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని చెబుతున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కరోనా వ్యాప్తి తగ్గడం మొదలైందని, విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగడం వల్ల ఈ మార్పు కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశంలో వయోజన జనాభాలో 74 శాతం మంది టీకాలు తీసుకున్నారని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)