ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తాజాగా ఈ కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎ.గోపీకృష్ణ, ఆనంద్‌కుమార్ తివారీని సస్పెండ్ చేస్తూ సోమవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కుంభకోణం చోటుచేసుకున్న సమయంలో గోపీకృష్ణ ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా, ఆనంద్‌కుమార్ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఈ ఇద్దరు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో వారిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Top Bureaucrats Suspended Amid Glare On Delhi Liquor Policy https://t.co/BKTeNHLb2M pic.twitter.com/fAxXM1Zknh
— NDTV News feed (@ndtvfeed) August 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)