దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు దుండగులు ఒక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి, అతడి స్నేహితుడిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో వారిద్దరూ గాయపడ్డారు.ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఏప్రిల్‌ 17న గ్యాంగ్‌స్టర్‌ నరేష్‌ శెట్టి షూటర్ల బృందానికి చెందిన అక్షయ్‌ నుంచి ప్రాపర్టీ డీలర్‌ వికాస్‌ దహియాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. తమకు డబ్బులు ఇవ్వాలని అతడ్ని డిమాండ్‌ చేసి బెదిరించాడు. అయితే వికాస్‌ దహియా ఈ బెదిరింపును పట్టించుకోలేదు. దీంతో పది రోజుల తర్వాత ఆ గ్యాంగ్‌ అతడ్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది.

వికాస్‌ దహియా, అతడి స్నేహితుడు దుండగులు కాల్పుల్లో గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నరేష్ శెట్టి గ్యాంగ్‌కు చెందిన షూటర్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గ్రహించారు. సమీర్‌, ఒక మైనర్‌ బాలుడ్ని గుర్తించి అరెస్ట్‌ చేశారు. మరో వ్యక్తి బంటీ కోసం వెతుకుతున్నారు.కాగా ప్రస్తుతం జైలులో ఉన్న నరేష్ శెట్టి, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సన్నిహితుడు. సిద్ధూ మూసావాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)