హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. తమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వచ్చిన డీఎస్పీని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్... నూహ్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో రైడింగ్ కు వెళ్లారు. ఇల్లీగల్ గా రాళ్లను తరలిస్తున్న వాహనానికి ఆయన అడ్డుగా నిలబడ్డారు. వాహనాన్ని ఆపాలని సైగ చేశారు. అయితే, వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా ఆయన పైకి ఎక్కించాడు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మృతి చెందాడు.

మరోవైపు వెంట్రుకవాసిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలతో బయటపడ్డారు. వాహనం దూసుకొస్తున్న సమయంలో వారిద్దరూ దారి పక్కకు జంప్ చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హర్యాణా పోలీసు శాఖ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని చట్టం ముందు నిలబెడతామని ట్వీట్ చేసింది. ఓ డంపర్ డ్రైవర్ డీఎస్పీపై నుంచి ట్రక్కును పోనిచ్చినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)